SKLM: రోడ్డు ప్రమాదంలో దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన మందస మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. VGపురం గ్రామానికి చెందిన ఎర్ర సింహాచలం (43) అనే దివ్యాంగుడు జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు స్కూటీ బోల్తా పడి తీవ్రగాయాల పాలయ్యాడు. తలకు బలమైన గాయం అవ్వడంతో పరిస్థితి విషమించి ఆయన మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.