NGKL: చారకొండ మండలం అగ్రహారం తండ గ్రామపంచాయతీ పరిధిలో మెయిన్ రోడ్డు నుంచి ఎంబాయిగడ్డ తండా వరకు రూ. 5 లక్షలతో మట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ సర్పంచ్ ప్రశాంత్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ రూప్ సింగ్, శంకర్ నాయక్, పర్వతాలు, తులసీరామ్, మణిపాల్, తదితరులు పాల్గొన్నారు.