SRD: ప్రభుత్వ హాస్టల్స్ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శనివారం స్థానిక బీసీ అభివృద్ధి కార్యాలయం ఆధ్వర్యంలో సంగారెడ్డి బీసీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు పట్టణంలోని BC హాస్టల్ విద్యార్థులకు కిర్బీ సంస్థ, CSR నిధుల ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు అందజేశారు.