MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘మహిళ ఉన్నతి—తెలంగాణ ప్రగతి’ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. MLA వినోద్, సబ్ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు రూ. 2 కోట్ల 31 లక్షల 12 వేల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమని తెలిపారు.