నెల్లూరు నగరంలో ఎంతో విశిష్టత, చారిత్రక నేపథ్యం గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం దేవస్థాన పునః నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 58 ఆలయాల అభివృద్ధి పనులకు రూ.118.45 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.