TG: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ చెప్పినా.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా.. ఈ విషయంలో ఎవరి మాట విననని స్పష్టం చేశారు. తన భార్య నిర్మల పోటీలో ఉంటుందన్నారు. సంగారెడ్డి ప్రజలు ఓడగొట్టినా తాను ఇంట్లో కూర్చోలేదని.. స్థానిక ఎన్నికల్లో పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు.