TG: HYDలోని BJP రాష్ట్ర కార్యాలయంలో గురుతేజ్ బహదూర్ 350వ వర్థంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు.. గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలన్నారు. బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయదన్న ఆయన.. బహదూర్ చేసిన త్యాగాన్ని గుర్తించి జయంతి, వర్ధంతులు నిర్వహిస్తున్నామని అన్నారు.