AP: TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పరకామణి చోరీ కేసులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని ఆదేశాలిచ్చారు. పద్మావతి అతిథిగృహం కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా హైకోర్టు ఆదేశాల అనంతరం సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక సమర్పించాల్సి ఉంది.