SKLM: నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద నిర్వహిస్తున్న సాధారణ తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తి వద్ద తనిఖీ చేయగా 20 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించామని సీఐ ఎం శ్రీనివాసరావు, ఎస్సై శేఖర్ రావు తెలిపారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో గంజాయి తరలిస్తున్నషేక్ రియాజ్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించమన్నారు.