అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై డిసెంబరు 16లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయకపోతే రాష్ట్రాల సీఎస్‌లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ మేరకు విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.