AP: కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. స్కూల్ విద్యార్థుల ఎదుట అసభ్యకర నృత్యాలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని మండిపడుతున్నారు.