ADB: అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నెరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఇందులో భాగంగా 54 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.