PDPL: గోదావరిఖనిలోని రామగుండం MLA రాజ్ ఠాకూర్ క్యాంపు కార్యాలయానికి సోమవారం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వచ్చారు. ఈ సందర్భంగా MLA కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి లోకల్ నాయకులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి భోజనం చేసి వెళ్లారు.