SKLM: నరసన్నపేట మండలం పెద్ద బొరిగివలస సచివాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. ఇవాళ ఉదయం స్థానిక సచివాలయానికి చేరుకున్న ఆయన రైతులతో నేరుగా మాట్లాడారు. రైతులకు ఉన్న సమస్యల పట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.