ఇటీవల పలువురు సెలబ్రిటీలు మాట తూలుతున్నారు. పబ్లిక్ వేదికల్లో నోరు జారడంతో విమర్శల పాలవుతున్నారు. వారణాసి ఈవెంట్లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అలాగే.. మంత్రి కొండా సురేఖ, దర్శకుడు మారుతి, హాస్యనటుడు బ్రహ్మానందం ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. మరోవైపు తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకర్ శివజ్యోతి.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.