VSP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ వివరాల నివేదికను త్వరగా సమర్పించాలని మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం ఆసీలమెట్ట కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 14 వార్డులలో ప్రజలు, విద్యార్థులు సంతకాలు చేశారన్నారు.