కడప: డిసెంబర్ 4వ తేదీన అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ RM గోపాల్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు డిపోల నుంచి ఒక్కో బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. అరుణాచలానికి వెళ్లే భక్తులు ఆయా డిపో మేనేజర్లను సంప్రదించాలని RM కోరారు.