WNP: తాను ఒక్కసారి కూడా కవితను పల్లెత్తు మాట అనలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో 10% పనులు పూర్తి చేస్తే సరిపోతుందని, పాలమూరు బిడ్డ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కవిత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపకుండా తనపై దుర్భాషలాడడం సమంజసం కాదన్నారు.