మహబూబాబాద్ జిల్లాలో సొసైటీల ద్వారా రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. దంతాలపల్లి,పెద్ద వంగర, కంబాలపల్లి, అప్పారాజుపల్లి, గంగారంలో కొత్త సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి కమిటీ మూడు సొసైటీలకు ఆమోదం తెలిపిందని, మిగిలిన వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.