VSP: లింగ ఆధారిత వివక్షపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న జెండర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.