ప్రకాశం: ఒంగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ విజయకృష్ణ వెల్లడించారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, విశ్వసనీయ సమాచారం ఆధారంగా సౌత్ బైపాస్ రోడ్‌పై ప్రత్యేక దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా 2.5 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.