PPM: కురుపాం ICDS ప్రాజెక్టు పరిధిలోని 33 మంది మినీ అంగన్వాడి వర్కర్లకు మెయిన్ అంగన్వాడి వర్కర్లగా పదోన్నతి లభించినట్లు CDPO బి. రజని దుర్గ సోమవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, స్దానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి చేతుల మీదగా పదోన్నతి పత్రాలను అందజేశారని ఆమె తెలిపారు.