VZM: బాడంగి మండలం గొల్లాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ చట్టాలపై బొబ్బిలి గ్రామీణ సీఐ నారాయణరావు సోమవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఇచ్చిన పదార్థాలు తీసుకోవద్దని సూచించారు. విద్యార్థులకు మహిళలపై గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై వివరించారు. అలాగే శక్తి యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.