VZM: బొబ్బిలి మండలం పక్కిగ్రామంలో ఉన్న పీహెచ్సీలో “హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ” సమావేశాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ వివరాలను, అత్యవసర సమయాల్లో కావలసిన మందుల అందుబాటు గురించి వాకబు చేశారు. తన తండ్రి జ్ఞాపకార్థం త్వరలో అత్యవసర మందులను ఉచితంగా పంపిణీ చేస్తానన్నారు.