W.G: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని (ఈనెల 26న) ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, వైసీపీ ఇంఛార్జ్ వెంకట్రాయుడు పిలుపునిచ్చారు. సోమవారం రాయలంలో ‘ఇంటింటా భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. భిన్న మతాలు, కులాల మధ్య ఐక్యత మన రాజ్యాంగ గొప్పతనమేనని, అంబేద్కర్ అందించిన ఈ పవిత్ర గ్రంథాన్ని ప్రతీ ఒక్కరూ స్మరించుకోవాలన్నారు