MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద రేకుల షెడ్డ్ నిర్మాణానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పాఠశాల మైదానంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మధుసూదన్ రావు అనే వ్యక్తి సుమారు ఐదు లక్షల రూపాయలు వేచించి షెడ్ నిర్మాణం చేస్తున్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.