SKLM: రణస్థలం మండలం రావాడ పంచాయతీలో జనసేన నాయకులు, ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డా.దానేటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మేరకు మహిళలకు సంబంధించిన వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వ్యాధులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.