MDK: సీఎం సహాయనిధి పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలం సంబంధించిన పలువురు నిరుపేదలు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. కాగా 11 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి 4 లక్షల 36వేల మంజూరయ్యాయి. ఈ మేరకు వారికి చెక్కులు ఇవాళ పంపిణీ చేశారు.