NZB: SRSP ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో తగ్గింది. ప్రస్తుతం 1,338 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని అధికారులు సోమవారం తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను నిలిపి వేశారు. ఇక సరస్వతి కాలువ ద్వారా 650 క్యూ సెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.