Kejriwal: ఢిల్లీలో అధికారుల పోస్టింగులు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను తప్పుపట్టారు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal). ఇదీ ఒక్క ఢిల్లీ సమస్య కాదు.. ప్రజల సమస్య అని చెప్పారు. ఢిల్లీకి సహకారం అందించిన కేసీఆర్‌కు కేజ్రీవాల్ (Kejriwal) ధన్యవాదాలు తెలియజేశారు. 2015 ఫిబ్రవరిలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. మే నెలలో మోడీ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ తీసుకొచ్చి తమ ప్రభుత్వాన్ని కూల్చివేశారని గుర్తుచేశారు. సర్వీస్ సంబంధిత విషయాల్లో ఇదివరకు షీలా దీక్షిత్ కంట్రోల్ ఉండేదని గుర్తుచేశారు. ఎనిమిదేళ్లు పోరాటం చేస్తే.. మే 11వ తేదీన తమకు అనుకూల తీర్పు వచ్చిందని.. 8 రోజుల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చారని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి.. ఆర్డినెన్స్ తేవడం ఎందుకు అని కేజ్రీవాల్ (Kejriwal) అడిగారు. ఇదీ ఢిల్లీ ప్రజలను అవమానించడమే అన్నారు. సీబీఐ, ఈడీతో బెదిరిస్తూ ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ సమయంలో అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల తరఫున దేశవ్యాప్తంగా తిరుగుతున్నానని కేజ్రీవాల్ (Kejriwal) వివరించారు. గవర్నర్ పాలన చేయాలనుకుంటే.. సీఎంను ఎందుకు ఎన్నుకోవాలని అడిగారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నానని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (maan) తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకే అధికారాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. గవర్నర్ వ్యవస్థను మోడీ సర్కారు (modi government) దుర్వినియోగం చేస్తోందని భగవంత్ మాన్ (maan) విమర్శించారు. బీజేపీయేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్లను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ రోజు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుందని.. చేసేదేమీ లేక బహిష్కరించామని తెలిపారు. సమావేశాలను కూడా తమకు నచ్చినట్టే నిర్వహిస్తున్నారని భగవంత్ మాన్ (maan) ధ్వజమెత్తారు.