E.G: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సత్య సాయి బాబా శతజయంతి వేడుకల్లో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన పుట్టపర్తి ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది సాయిబాబా సేవలేనన్నారు. గురుకుల విద్య తమజీవితానికి మార్గదర్శకమైందని వ్యక్తిగతంగా పేర్కొన్నారు. రాష్ట్ర పండుగగా ఆయన శతజయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం గర్వకారణమన్నారు.