KKD: తుని మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ లోవకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తుల రాక ఆరంభమైంది. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 13,000 మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా.. వివిధ విభాగాల ద్వారా రూ.4,27,868 ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు.