కోనసీమ: కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలకు నష్ట పరిహారాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఎంపీ హరీష్ బాలయోగి పంపిణీ చేశారు. గ్రామంలోని 2,685 కుటుంబాలకు వెయ్యి రూపాయల చొప్పున 26 లక్షల 85 వేల రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు.