NLR: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆ పార్టీ సీనియర్ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి వరించిన నేపథ్యంలో ఆయన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు సాయం చేస్తానని తెలిపారు. కాగా మైనింగ్ అక్రమ రవాణా కేసులో శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఇటీవల విడుదలయ్యారు.