కృష్ణా: మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యం తర్వాత కోలుకొని మళ్లీ తిరిగి గుడివాడ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన కే. లోకేశ్వర రాజు కుటుంబాన్ని మాజీ మంత్రి కొడాలి నాని ఆదివారం పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మెరుగుమాల కాళీ, ధర్మేంద్ర రాజు, బీహార్ రాజు తదితరులు పాల్గొన్నారు.