VSP: దువ్వాడ రైల్వే స్టేషన్–సబ్బవరం ప్రధాన రహదారిపై మురుగు నీరు పారిపోవడంతో నెలరోజులుగా వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 88వ వార్డులో కాలువ పూడికతో నీరు రహదారిపైకి ఎగబాకినా ప్రజారోగ్య శాఖ, కార్పొరేటర్ స్పందించకపోవడంపై వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాలువ శుభ్రం చేసి రహదారిని రక్షించాలని, లేకుంటే రోడ్ నాశనం అవుతుందన్నారు.