అన్నమయ్య: మొలకలచెరువు మండలంలో దొంగలు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి రాగి వైర్‌ను చోరీ చేశారు. పెద్దపాలెం రైల్వే బ్రిడ్జి సమీపంలో కొండా సిద్ధార్థ నిర్మిస్తున్న స్కూల్ వద్ద వ్యవసాయ పొలంలో అమర్చిన హెచ్డీఎఫ్సీ ట్రాన్స్ఫార్మర్పై ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం పొలం యజమాని ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.