సత్యసాయి: ‘విక్షిత్ భారత్ @2047’ నిర్మాణంలో పౌర సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. పుట్టపర్తిలోని NACINలో సివిల్ సర్వీసెస్ ట్రైనీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పరోక్ష పన్నుల వ్యవస్థను క్రమబద్ధీకరించిన జీఎస్టీ ఒక మైలురాయి సంస్కరణ అన్నారు. పన్ను ఎగవేతదారులను అరికట్టాలని అధికారులను కోరారు.