కృష్ణా: ప్రతిభావంతులు మరింతగా ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ గాంధీక్షేత్రంలో బొండాడ ఫౌండేషన్ సహకారంతో రాయల్ సర్వీస్ ట్రస్ట్ వారు నియోజకవర్గంలోని 82 మంది కళాశాల విద్యార్థులకు ఫౌండేషన్ చైర్మన్ బొండాడ నీలిమ ఎమ్మెల్యే చేతులమీదుగా రూ.ఆరు లక్షలు స్కాలర్ షిప్స్ పంపిణీ చేశారు. డాక్టర్ బాల బాలాజీ, సీతాలం రాంబాబు పాల్గొన్నారు.