ADB: జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి గ్రామ దేవత పోచమ్మ తల్లి ఆలయం శిథిలావస్థకు చేరింది. దీంతో గ్రామస్తులంతా కలిసి పాత ఆలయాన్ని కూల్చివేసి నూతన ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం పోచమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసరి రాములు, మాజీ ఉపసర్పంచ్ స్వామి, గ్రామస్తులు ఉన్నారు.