NZB: గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన KCR ప్రభుత్వం ఉద్యోగుల డబ్బును తమ స్వార్థం కోసం వాడుకుందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. జిల్లా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ 3వ మహాసభల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందన్నారు.