NTR: రాబోయే తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజ్ఞప్తి చేశారు. నవంబర్ 26 నుంచి భారీ వర్షాలు, బలమైన గాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని రక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దని, పత్తి, మొక్కజొన్న రైతులు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరారు.