SKLM: నరసన్నపేట చెందిన బంగారు వ్యాపారి హత్య కేసును చాకచక్యంతో ఛేదించిన పోలాకి ఎస్సై జి. రంజిత్‌ను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్సై రంజిత్‌కు ఎస్పీ ‘ప్రశంసా పత్రాన్ని’ అందజేశారు. భవిష్యత్తులోనూ కేసుల పరిష్కారంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఎస్సై కి సూచించారు.