W.G: దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేసే మూడు చక్రాల స్కూటీల దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్ నెలాఖరు వరకు పెంచాలని ఏపీ వికలాంగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లాడి నటరాజు కోరారు. అలాగే నియోజకవర్గానికి 30 స్కూటర్లు కేటాయించాలని, విద్యార్హత నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు. పంపిణీ రోజే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.