ADB: జిల్లాలోని ప్రజలందరి సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము అవార్డు పొందిన కలెక్టర్ రాజర్షి షాను కాంగ్రెస్ నాయకులు పట్టణంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కలిసిన వారిలో నాయకులు సంతోష్, సతీష్, నర్సింగ్ తదితరులున్నారు.