కృష్ణా: అన్నదాత – సుఖీభవ పథకం రైతుల కళ్ళల్లో సంతోషం నింపుతోందని మెరకనపల్లి పీఏసీఎస్ చైర్మన్ యర్రంశెట్టి సుబ్బారావు అన్నారు. శనివారం మోపిదేవి మండలం మెరకనపల్లి పీఏసీఎస్ కార్యాలయంలో పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఏడాదిలో రెండు విడతలుగా రూ.14వేలు పెట్టుబడి సహాయం అందించినట్లు తెలిపారు.