TG: గద్వాల జిల్లాలోని నందిన్నే మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. భీమరాయుడిది రోడ్డు ప్రమాదం కాదని.. హత్యే అని తేల్చారు. ఈ హత్య వెనక సూత్రధారిగా భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయలసీమకు చెందిన సుపారీ గ్యాంగ్‌ను ఈ హత్యకు వినియోగించినట్లు అనుమానిస్తున్నారు.