CTR: కోదండరామ స్వామి దేవస్థానం అభివృద్ధికి కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో కృషి చేయాలని MLA జగన్ మోహన్ పిలుపునిచ్చారు. చిత్తూరు చర్చి వీధిలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కమిటీ ఛైర్మన్గా మధు నాయుడు, 9 మంది సభ్యులు ప్రమాణం చేశారు.