SRPT: తుంగతుర్తి మండలం గొట్టిపర్తి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని రంజితకు అండగా నిలిచి ఆమెపై ఉదారత్వం చాటుకున్నారు. రంజిత తండ్రి రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యారయులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రంజిత తల్లి మంగమ్మకు రూ.5వేల ఆర్థిక సాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు.