HYD: చర్లపల్లి రైల్వే టెర్మినల్లో భద్రతను పటిష్టం చేస్తూ ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తం 250 కెమెరాలు అమర్చగా, నేరస్థులు, అనుమానితుల కదలికలను గుర్తించేందుకు 15 ముఖ్యమైన ఎఫెక్టివ్ కెమెరాలను ప్రవేశ మార్గాలు, టిక్కెట్ కౌంటర్లు, విశ్రాంతి గదుల వద్ద ఏర్పాటు చేశారు.